Saturday, November 16, 2024

సుంకిశాలపై సర్కార్ సీరియస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో : సుంకిశాలలో జరిగిన సంఘటన నేపథ్యంలో పురపాలక శాఖ సంబంధిత అధికారులపై వేటు వేసింది. ఈ మేరకు బుధవారం వా రిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సుంకివాల ప్రాజెక్టు కార్యకలాపాలకు సంబంధించి జలమండలికి చెందిన 4 అధికారులను బాధ్యులుగా పురపాలక శాఖ గుర్తించింది. సీజీఎం కిరణ్, జీఎం మరియరాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీశ్‌లను స స్పెండ్ చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి దానకిశోర్ ఆదేశాలు జారీ చేశారు.

సుంకిశాల ప్రాజెక్ట్ ఎగ్జిక్యూష న్ కోసం మొత్తం పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తున్న డైరెక్టర్ (ప్రాజెక్ట్)ని అతని బాధ్యతల నుండి డిశ్చార్జ్ చే యడం తప్పనిసరి అని ప్రభుత్వం నిర్దేశించింది. జలమండలి డైరెక్టర్ (ప్రాజెక్ట్ -II) డి. సుదర్శన్‌ను బదిలీ చేసి నాన్ ఫోకల్ పోస్టులో నియమించాలని జలమండలి ఎండికి ఆదేశాలు జారీచేసింది. డైరెక్టర్ (ప్రాజెక్ట్ III)పోస్టులో జలమండలికి చెందిన మరో సమర్థవంతమైన అదికారిని నియమించాలని మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశించింది.

సంఘటనపై కమిటీ
సుంకిశాల ప్రాజెక్టు ఘటనపై బోర్డు స్థాయిలో ఉన్నతస్థాయి ఇంజినీర్లతో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది జలమండలి. విచారణ సభ్యులుగా జలమండలి ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్ ఉన్నారు. కమిటీకి అధికారులు అందజేసిన వివరణతో సంతృప్తి చెందని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News