Monday, December 23, 2024

మరో సిటీగా బెగరికంచ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రంగారెడ్డి కలెక్టరేట్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టిందని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. యువత జీవితంలో వెలుగులు నిం పడమే లక్షంగా ఈ యూనివర్సిటీ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్ సమీపంలోని బేగరికంచ వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి సిఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ నిర్వహించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలసి సిఎం ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యువత భవితకు బంగారుబాట వేయనుందని అన్నారు. యూనివర్సిటీ నిర్మాణం కోసం అసెంబ్లీలో ప్రత్యేక బిల్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో భూములిచ్చిన ప్రజలు వారి కుటుంభసభ్యులకు ప్రయోజనం చేకూరేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వారికి విద్య,వైద్యం, మౌళికవసతులు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సుమారు 150 కోట్ల రూపాయలతో స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. విద్యార్థులకు శిక్షణనందించి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు.

బేగరికంచ ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. హెల్త్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజంతోపాటు ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఎల్‌బినగర్ నుండి శంషాబాద్ మీదుగా బేగరికంచ వరకు మెట్రోరైల్ తీసుకువస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరో మహానగరంగా రూపుదిద్దుకోనుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే లక్షంగా తమ ప్రభుత్వం ముందుకుసాగుతుందని ఆయన తెలిపారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రు లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ శశాంక, నాయకులు చల్లా నర్సింహారెడ్డి, కెఎల్‌ఆర్, మహేందర్‌రెడ్డి, తీగల అనిత హరినాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News