- Advertisement -
రాష్ట్రంలో ధాన్య కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని చెప్పారు.
తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనడం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చేవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని కెటిఆర్ హెచ్చరించారు.
- Advertisement -