తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందర్లోనే కూలిపోతుందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి.. తెలంగాణలో అధికారంలోకి రావాలని చూసింది. కానీ తెలంగాణ ప్రజలు వారికి బుద్ది చెప్పి పదేళ్లు అధికారం లేకుండా చేశారు. ఎన్నో అబద్ధాలు చెప్పి మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. కానీ ఆ ప్రభుత్వం ఎన్నోరోజులు నిలబడదు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెల్లలో కూలిపోతుంది అని కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత.. జూబ్లీహిల్స్ పిఎస్ లో విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు చేశారు. బిఆర్ఎస్, వైసిపి కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఎపిలో జరిగే ఎన్నికలకు బిఅర్ఎస్ ఫండింగ్ ఇస్తుందని ఆరోపించారు. ఇద్దరు మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని చెప్పారు.
తెలంగాణలో సుస్థిర పాలన ఉంది.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయసాయి రెడ్డి లాంటి నాయకుల వాఖ్యలు చెల్లుబాటు కావని.. ఆయన వాఖ్యలపై సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ చైర్మన్.. విజయసాయి రెడ్డి వాఖ్యలపై చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. నల్గొండలో బహిరంగ సభ నిర్వహించి తీరుతాం: కెసిఆర్