తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఐదు కీలక బిల్లులను సోమవారం ప్రవేశపెట్టింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగియగానే శాసనసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టరు. వీటిలో ముఖ్యమైన బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించే మరో బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, దేవాదాయ శాఖ చట్ట సవరణపై బిల్లులను ప్రవేశపెట్టారు. బీసీ రిజర్వేషన్ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ సభలో ప్రవేశపెట్టారు. అలాగే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టే బిల్లును కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరఫున మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టారు. చర్చకు అనుమతించిన అనంతరం ఈ బిల్లుకు సభలో ఆమోదం లభించింది. అనంతరం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు, స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుక కూడా సభ ఆమోదించింది.
ఐదు బిల్లులు సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
- Advertisement -