Wednesday, January 22, 2025

రేపే కాంగ్రెస్ కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో 36వేల మంది బూత్ స్థాయి సమన్వయకర్తలతో ఎఐసిసి చీఫ్ ఖర్గే, సిఎం రేవంత్‌రెడ్డిల సమావేశం

కీలకమైన పోల్‌మేనేజ్‌మెంట్‌పై దిశానిర్ధేశం
లోక్‌సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుపే లక్ష్యంగా ముందుకు….

మనతెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా కసరత్తులు చేస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి రాష్ట్ర నేతలకు దిశానిర్ధేశం చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లో బూత్ స్థాయి అధ్యక్షులతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కీలకమైన పోల్‌మేనేజ్‌మెంట్‌పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి లోక్‌సభ నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

మరో వైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ రెండు రోజులుగా గాంధీ భవన్‌లో మైనార్టీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ భేటీకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నేతలు హాజరై పార్టీపరంగా ముందుకెళ్లే కార్యాచరణపై చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు నిర్ణీత సమయంలో కాకుండా ముందే జరగొచ్చన్న అంచనాలతో ఎప్పుడు ఎన్నికలు జరిగిన సిద్ధంగా ఉండేలా పార్టీ నాయకత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News