Thursday, January 23, 2025

ఆంధ్ర ప్రాంతంతో కలిపి… తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్!

- Advertisement -
- Advertisement -

రేవంత్ .. కాంగ్రెస్ చరిత్ర తెలుసుకుని మాట్లాడు : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్ర ప్రాంతంతో కలిపి తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని టి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారని, అసలు కాంగ్రెస్ వల్లే తెలంగాణ ప్రాంతం ఆంధ్రాలో కలిసిందనే చరిత్రను ఆయన తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ఆలీబాబా అరడజను దొంగల్లాగా మారిందని వై.సతీష్ రెడ్డి విమర్శించారు. అవినీతికి, స్కాములకు కేరాఫ్ కాంగ్రెస్ అని, రాహుల్ బాబా మూడు డజన్ల దొంగల కమిటీగా అది అవతరించిందన్నారు. హైదరాబాద్ స్టేట్ గా అత్యధిక రెవెన్యూతో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్రకు ముడి పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో పుట్టి పెరిగిన రేవంత్ .. అసలు కాంగ్రెస్ చరిత్ర ఏంటో తెలుసుకోవాలన్నారు. ఆంధ్రతో కలిపి 60 ఏళ్లు తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుతిన్న కాంగ్రెస్ పార్టీ.. సుసంపన్నంగా ఉన్న ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేసి సర్వనాశనం చేసిందన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి తెలంగాణను తీసుకొచ్చిన సిఎం కెసిఆర్ గత 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుండడంతోనే ఇప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతోందన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజల పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. రేవంత్ రెడ్డి.. నీ మూలాలు ఏంటి? నీ రాజకీయ జీవితం ఎక్కడ మొదలైంది? నువ్వు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం ఏమిటీ? అని రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రశ్నించారు. టికెట్లు అమ్ముకుంటున్న బ్రోకర్ రేవంత్ రెడ్డి అని… డబ్బుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్లకే వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు.

రేపు కాంగ్రెస్ గుర్తు మీద గెలిచినోళ్లను కూడా బిజెపికి అమ్ముకుంటాడన్నారు. కాంగ్రెస్ నాయకులు నూటికి నూరు పాళ్లు చిత్తకార్తె కుక్కలేనని అందులో ఎలాంటి అనుమానం లేదని ఎద్దేవా చేశారు. తమ సిఎం కెసిఆర్ నూటికి నూరు పాళ్లు బాహుబలి. కాబట్టే ఆయన చేసిన పోరాటానికి దిగివచ్చి.. మరో మార్గం లేక ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తెలంగాణను ప్రకటించారన్నారు. ఢిల్లీకి బాద్ షాలం.. అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా చుక్కలు చూపించిన బాహుబలి కెసిఆర్ అన్నారు. అనునిత్యం తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న కెసిఆర్‌పై విమర్శలు వద్దని, తాము ఏ టెస్టుకు అయినా సిద్ధమని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News