Monday, December 23, 2024

కాంగ్రెస్ పనైపోయింది.. 

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : “తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు.. కమ్యూనిస్టుల పనైపోయింది. సూది దబ్బడం పార్టీలని అవమానించిన వారి పంచనే చేరిన సిగ్గు, శరంలేని పార్టీల నేతలు కమ్యూనిస్టులు”అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బిజెపి సింహంలాంటి పార్టీ అని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. ఈ నెల 15న కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిందుకు శుక్రవారం ఖమ్మం వచ్చిన ఆయన బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

ఖమ్మం నగరంలోని వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ సర్దార్ పటేల్ గ్రౌండ్‌కు అభినవ సర్దార్ పటేల్ రాబోతున్నారు. ఖమ్మంలో బిజెపి సత్తా ఏందో “నిరుద్యోగ మార్చ్‌” ద్వారా చూపించాం. రేపు అమిత్ షా సభను సక్సెస్ చేసి మరోసారి దమ్ము చూపిస్తామన్నారు. కమ్యూనిస్టు పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని. ఆ పార్టీలను సూది దబ్బడం పార్టీలని అవమానించిన వారి పంచనే కమ్యూనిస్టులు చేరారంటే వాళ్లకు సిగ్గు శరం లేదని అర్ధమైతోందన్నారు.

తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదని, తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా ఖమ్మంలో ఇటివల జరిగిన నిరుద్యోగ మార్చ్ సక్సెస్ తో అందరి కళ్లు బైర్లు కమ్మినయ్. మళ్లీ 15న అమిత్ షా వస్తున్నారని తెలుసుకుని అనేక పార్టీలకు చెమటలు పడుతున్నయని. ఇక్కడ అమిత్ షా సభ విజవంతమైన తరువాత అవసరమైతే ప్రధాని మోడీతో కొత్తగూడెంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. అమిత్ షా సభ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఖమ్మం జిల్లాలో కూడా 70 శాతం పోలింగ్ బూత్ కమిటీలను పూర్తి చేశామన్నారు.

గతంలో బిజెపిని ఉరికించి కొడతామన్న నేతలకు మన సత్తా తెలిసి నోరు మూసుకున్నారని. ఎక్కడ చూసినా జనం బిజెపి పేరే ఉచ్చరిస్తున్నారని. ఖమ్మం జిల్లాలో నేతల ఆగడాలకు బలైపోయిన సాయి గణేష్ త్యాగాలను వృథాగా పోనీయ్యమని అందులో భాగంగా ఈ నెల 15న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీమంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎం.ధర్మారావు, కొండేటి శ్రీధర్, కుంజా సత్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ తోపాటు వివిధ జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యానారాయణ, కోనేరు చిన్ని, బొబ్బ భాగ్యారెడ్డి, రామచంద్రారెడ్డి, రావు పద్మ, కంకణాల శ్రీధర్ రెడ్డి, అధికార ప్రతినిధులు రాకేశ్ రెడ్డి, పాల్వాయి రజనీతోపాటు రాష్ట్ర నాయకులు గీతామూర్తి, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, కడగంచి రమేశ్, విద్యా సాగర్ రెడ్డి, ఉప్పల శారద తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News