Saturday, November 23, 2024

ప్రజాస్వామ్యం ఖూనీ

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షం గొంతు నొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం
అసెంబ్లీలో మూడు నిమిషాల్లో మూడుసార్లు మైక్ కట్ చేశారు…

శాసనసభ మీడియా పాయింట్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ హరీశ్ రావు వ్యాఖ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ ఖూనీ చేసిందని బిఆర్‌ఎస్ సిద్దిపేట ఎంఎల్‌ఏ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆ నాడు తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో రేవంత్‌ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష గొంతునొక్కేలా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. మూడు నిమిషాల్లో మూడుసార్లు మైక్ కట్ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని.. చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి… ఏంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మాకు మైక్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. మేమం మాట్లాడితే మైక్‌లు కట్ చేసి సభను వాయిదా వేశారన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలకు పూర్తిగా సమయం ఇచ్చి దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని పివి. నరసింహారావుకు గుంటెడు భూమి కూడా ఇవ్వలేదని.. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు మళ్లీ అన్నీ అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రజాస్వామ్యబద్దంగా ఉంటామని చెప్పి గొంతు నొక్కుతున్నారన్నారని, అమరవీరులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం గౌరవించిందని గుర్తుచేశారు. సిఎం రేవంత్ అన్నీ స్వీపింగ్ కామెంట్ చేస్తున్నారని.. తెలంగాణ ఉద్యమకారులు, అమర వీరులగురించి మాట్లాడి నైతిక హక్కు రేవంత్‌కు లేదన్నారు. రేవంత్‌కు ఉద్యమం గురించి మాట్లాడే హక్కు లేదని.. ఆ నాడు ఉద్యమకాలంలో రేవంత్ ఎక్కడనున్నరన్నారు. కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నామన్నామని, వ్యవసాయ వృద్ధిరేటులో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒక ఏడాదిలో 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని.. వ్యవసాయ వృద్ధిరేటులో నేడు తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదన్నారు. మిరపపంటలో తెలంగాణ నెంబర్ వన్ ఉందన్నారు. మేం సంపద పెంచినం.. పేదలకు పంచామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని.. రైతుబీమా ఎందుకని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు.కెసిఆర్ పాలనలో భూగర్భ జలాలు పెరిగాయని.. తెలంగాణలో ఆరున్నర మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని. బోర్ల కింద, ప్రాజెక్టుల కింద ఆయకట్టు పెరిగిందని తెలిపారు.

ఉమ్మడి ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకొని ఎండబెట్టారని.. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసిన చరిత్ర మాదన్నారు. పాలమూరు పచ్చబడేలా చేశామన్నారు. అప్పుడు బలి దేవత అన్న సోనియా ఇప్పుడు దేవత అయ్యింది అంటూ విమర్శించారు. రాజకీయం కోసం కాంగ్రెస్ కపట ప్రేమ చూపిస్తుందని.. తెలంగాణ అమరుల చావుకు సోనియాగాంధీ కారణం కాదా?.. సోనియాగాంధీని బలిదేవత అన్నది రేవంత్ కాదా? అంటూ నిలదీశారు. సంపద పెంచి ప్రజలకు పంచిన ఘనత బీఆర్‌ఎస్దని.. అప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ మా గొంతు నొక్కుతుందని.. సభ జరిగిన తీరు చాలా దురదృష్టకరమంటూ హరీశ్ రావు మండిపడ్డారు.

Harish Rao 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News