Sunday, December 29, 2024

హామీల అమలులో కాంగ్రెస్‌కు రోడ్ మ్యాప్ లేదు

- Advertisement -
- Advertisement -

ప్రజాపాలన దరఖాస్తులతో ప్రభుత్వం కాలయాపన
ఏప్రిల్‌లో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికలు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:  ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి దశ దిశాలేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన పేరుతో తీసుకున్న దరఖాస్తులకు ఇప్పటి వరకు ఎలాంటి అతీగతి లేదని మండిపడ్డారు. దేశంలో వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశముందని తెలిపారు. గతంలో కూడా అదే సమయంలో ఎన్నికలు జరిగాయని, మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రులే జైలుకు వెళ్లారని, గత ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వమని ఆరోపించారు. మోడీ హయాంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా సుస్థిర పాలన సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఇబ్బంది పడిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చక చతికిల పడ్డదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా హామీలు అమలు చేస్తుందనేది చెప్పడం లేదన్నారు. భారతీయ సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయోధ్య రామ మందిరమని, సోమవారం అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి హిందువు పండగ చేసుకుంటున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News