Sunday, December 22, 2024

మరోసారి రైతు వ్యతిరేక విధానాలను బయటపెట్టుకున్న కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్ : కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను మరోసారి బయటపెట్టుకుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, హుజురాబాద్ బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన నేఫథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా నేడు హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు నిరసనలు వ్యక్తం చేయాలని సూచించారు.

తెలంగాణ రైతన్నకు 24గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేఫథ్యంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీది అన్నారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులకు గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News