- ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
కొడంగల్: కొడంగల్‌లో దొరల రాజ్యం పోయిందని, కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని అంగడిరైచూర్‌లో ఎమ్మెల్యే పర్యటించారు. కాంగ్రెస్, బిజెపిలకు చెందిన పలువురు బిఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలతోపాటు కొడంగల్, కోస్గీ మున్సిపాలిటీల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గత 60 ఏండ్లలో లేని అభివృద్ధ్దిని నాలుగేళ్లలో చేసినట్లు గుర్తు చేశారు. నేను చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రేవంత్‌రెడ్డి, గుర్నాథ్‌రెడ్డి ఒకటయ్యారని ఆరోపించారు. తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యే ఉన్న రేవంత్‌రెడ్డి నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చేవాడని, ఏనాడు కూడా ప్రజలకు అందుబాటులో లేడని విమర్శించారు.
కార్యకర్తలకే అందుబాటులో లేని రేవంత్‌రెడ్డి గుర్నాథ్‌రెడ్డితో ఎందుకు కలుస్తున్నారో వారికే తెలియాలన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దని, మూడు గంటలే సరిపోంతుందని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. నియోజకరవ్గంలో రూ. 300 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బిఆర్‌ఎస్ కార్యకర్తలు దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుల దామోదర్‌రెడ్డి, సర్పంచ్ గోవింద్, వైస్ ఎంపిపి రహమతుల్లా ఖాన్, నాయకులు మధుసూధన్‌రావు, ఆరుణ్, నరేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.