Thursday, January 23, 2025

అట్టడుగు వర్గాల ప్రజలకు కాంగ్రెస్ చేయూత

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : అట్టడుగు వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చెయ్యి అందిస్తుందని తెలంగాణ సీఎస్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పిపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యాపేట పట్టణంలో ఆదివారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా సా ్థనిక శంకర్ విలాస్ సెంటర్‌వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చే సుకోవడం తప్పనిసరి అన్నారు. తొమ్మిదేళ్ళ కాలంలో బీఆర్‌ఎస్ ప్ర భుత్వం ప్రజా సమస్యలను ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, పేదలకు ఇండ్లు, భూ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, అందుకోసం ప్రజలందరు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. 103రోజుల క్రితం ప్రారంభించిన పాదయాత్ర ద్వారా ఎన్నో సమస్యలు, వి విధ వర్గాల ప్రజలు తమ దృష్టికి తీసుకరావడం జరిగిందని, వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో పని చేస్తుందని హామీ ఇచ్చారు. అన్నదాతలు పండించిన పంటలను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులతో తమ పిల్లలను చదివిస్తే ఉద్యోగాలు రాకా వీధుల వెంట గడ్డాలు పెంచుకోని తిరుగుతున్న పరిస్థితి హృదయాలను కలచివేస్తుందన్నారు. జిల్లాకు ఎన్నో పథకాలు తీసుకవచ్చి అమలు చేశామని చెప్పుకుంటున్న మంత్రి జగదీష్‌రెడ్డి నక్కలగండి, ఎల్‌ఎస్‌బీసీ టెన్నేల్, డిండి ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు.

కేంద్ర ప్ర భుత్వం బీసీ కుల గణన చెపట్టడానికి చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని, జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల జనాభాకు అనుకూలంగా అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించేందుకు కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకరావడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దకాలంగా పెరుకుపోయిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆవైపుగా ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పీసీసీ మాజీ అధ్యక్షులు హన్మంతరావు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే దోరణితో వ్యవహరిస్తూ నిర్లక్షం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా నాటి నెహ్రు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చిన మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ప్రతీ ఏటా రెండు లక్షల మంది ఉద్యోగాలను ఊడగోడుతుందని ఆ వేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో వచ్చిన మార్పుద్వారా రానున్న రో జుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి, కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఉత్తమ్‌పద్మావతి, కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు జగదీశ్వర్, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి,ప్రీతం, బాలలక్ష్మీ, డాక్టర్ రవి బాబు, ధరావత్ వెంకన్న నాయక్, అన్నేపర్తి జ్ఞానసుందర్, అంబేద్కకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాదయాత్ర సూర్యాపేట పట్టణం నుంచి చివ్వెంల మండలం బీబీగూడెంలోకి చేరుకుంది.

వర్గపోరు, తోపులాటా…
సూర్యాపేట పట్టణంలో టీసీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చేపట్టిన పిపుల్స్ మార్చ్ యాత్ర పట్టణంలోని ఎడ్ల గోపయ్య విగ్రహం సమీపంలో వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డిలకు చెందిన రెండు వర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకంది. కార్నర్ మీటింగ్‌లు, విశ్రాంతి వేదిక ల వద్ద ఐక్యతరాగాలు వినిపించే కాంగ్రెస్ నాయకులు ర్యాలీల సందర్భంగా అనుసరిస్తున్న తీరుతో ప్రజలు రాజకీయ వర్గాలు ముక్కున వేలు వేసుకుంటున్న తీరు కనిపిస్తుంది. మొదటి రోజు శనివారం రాత్రి కూడా స్వల్ప తోపులాటకు పాల్పడిన వర్గాలు రెండోరోజు మరోమారు తమ తీరును కొనసాగించడం శోచనీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News