Monday, December 23, 2024

ఈ నెల 26న హస్తినకు కాంగ్రెస్ నేతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఈ నెల 26న హస్తినకు రావాలని ఆ పార్టీ కోరింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. మరో వైపున తెలంగాణలో ప్రతి 10 రోజులకు ఓసారి ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించేలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. తెలంగాణ సహా ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి పిలుపు వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో అనుసరిం ల్సిన వ్యూహలపై కాగ్రెస్ నాయకత్వం చర్చించనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

దీంతో తెలంగాణపై ఆ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. గత రెండు దఫాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారానికి దూరమైంది. అయితే ఈ దఫా జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కూడా రెండు దఫాలు అధికారానికి దూరం కావడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నిరాశను మిగిల్చింది. దీంతో ఈ దఫా తెలంగాణలో పాగా వేసేందుకు ఆ పార్టీ కొంత కాలంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు నేతృత్వంలో ఎన్నికల వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం విదితమే. 8వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించింది.

త్వరలోనే బిసి డిక్లరేషన్ ను ప్రకటించనుంది. పిసిసి తెలంగాణ విస్తృతస్థాయి సమావేశం సోమవారం గాంధీ భవన్‌లో నిర్వహించారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ నేతల మధ్య ఐక్యత తీసుకువచ్చింది నాయకత్వం. మరో వైపు ఓటర్లను ఆకర్షించేలా ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు కురిపించారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో వరంగల్ సభలోనే ఆ పార్టీ ప్రకటించింది. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఈ నెల 8న యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటించారు. జూన్ లో ప్రియాంకగాంధీ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News