Tuesday, November 26, 2024

రేవంత్ ‘కరెంటు’ కామెంట్స్: కాంగ్రెస్ కు లాభమా?.. నష్టమా?

- Advertisement -
- Advertisement -

ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపాయి. రేవంత్ వ్యాఖ్యలు అస్త్రంగా మల్చుకునేందుకు ప్రయత్నించిన బిఆర్ఎస్ బొక్కబోర్ల పడిందా? అంటే.. పరిస్థితులు అవుననే అంటున్నాయి.రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ తొందరపాటుతో అసలు తెలంగాణలో వ్యావసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందుతుందా అనే విషయం ప్రజల్లో ఆలోచించేలా చేసింది. ఒక రకంగా ఇది కాంగ్రెస్ పార్టీ మేలు చేసిందనే చెప్పాలి. అయితే, రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ చేసిన ధర్నాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై మరింత ఫోకస్ చేసింది.సిఎం పదవి, కరెంటుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరినట్లు సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతోంది. భట్టి పాదయాత్ర, ఖమ్మం సభతో పార్టీలో కొత్త జోష్ మొదలైంది. నేతలంతా ఒక్కటిగా పార్టీ కోసం పని చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఎవరు సీఎం అనేది పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ సీఎంగా సీతక్క అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీని పైన పార్టీ నాయకత్వం గుర్రుగా ఉంది. రేవంత్ ప్రకటనతో పార్టీలో భిన్నాభిప్రాయాలు రాకుండా వెంటనే సీనియర్లు సరిదిద్దే ప్రయత్నం చేసారు.

ఇప్పటికే తెలంగాణ వ్యవహారాల్లో స్వయంగా పార్టీ హైకమాండ్ ప్రతీ అంశాన్ని నేరుగా పర్యవేక్షిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు టీ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చగా మారింది. కాంగ్రెస్ కు పరిస్థితులు అనుకూలంగా మారుతున్న వేళ సీనియర్లు అన్ని అంశాలు పక్కన పెట్టి సహకారం అందిస్తున్నారు. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీని ఆత్మరక్షణలోకి తీసుకెళ్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. దీంతో వీటిని కంట్రోల్ చేసేందుకు రేవంత్ ను వివరణ కోరిన హైకమాండ్ తమ వైఖరిని స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది.

గతంలోనూ రేవంత్ తీరు వివాదాస్పదమే. సీనియర్లకు వ్యతిరేకంగా రేవంత్ మద్దతు దారులు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిన వ్యవహారం పైన నేతలు నేరుగా ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదులు చేసారు. పార్టీ సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా రేవంత్ తన మద్దతు దారులను ప్రోత్సహించటం వంటివి పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News