Saturday, June 29, 2024

శాంతించిన జీవన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎంఎల్‌సి జీవన్ రెడ్డి ఎట్టకేలకు అలకవీ డారు. ఢిల్లీ పెద్దల బుజ్జగింపులు వల్ల జీవన్ రెడ్డి ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయం నుండి వెనక్కు తగ్గారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. పార్టీయే ముఖ్యమని ఆయన స్పష్టం చేశా రు. మారుతు న్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పవన్నారు. మొదటినుంచి ఉన్నవారికి ప్రాధాన్యత, గౌరవం ఇస్తామని కెసి వేణుగోపాల్ ఈ సందర్భంగ హామీ ఇచ్చారు.

పార్టీలో చేరికలకు డోర్లు తెరి చే ఉన్నాయని దీపాదాస్ మున్షీ అన్నారు.అయినా సీనియర్లకు ప్రాధా న్యం ఇస్తామని ఆమె హామినిచ్చారు. కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సం జయ్ చేరికతో అలక బూనిన జీవన్‌రెడ్డి తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయంపై కాం గ్రెస్ అధిష్ఠానం స్పందించింది. ఢిల్లీకి రా వాలని జీవన్‌రెడ్డికి దీపాదాస్ మున్షీ నుంచి పిలుపు వచ్చింది. హైకమాం డ్ ఆదేశాల మేరకు ఆయన దిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పెద్దల నచ్చ జెప్పడంతో ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి మనసు మార్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News