Saturday, December 21, 2024

పేదల నడ్డి విరిచారు.. పురోగతిని అడ్డుకున్నారు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వేశ ఆర్థిక వెన్నెముకను విరిచేదిగా, జీవనోపాధిని దెబ్బతీసేదిగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ జరిగి ఏడేళ్లు అయిన దశలో బుధవారం కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే , రాహుల్ గాంధీ ఇతర నేతలు దీనిపై ఘాటుగా స్పందించారు. 2013లో ఆరంభమైన ఆర్థిక రికవరీకి ఈ పెద్ద నోట్ల రద్దు అడ్డుకట్టగా మారిందని, ఇదంతా కూడా కావాలని పన్నిన దుష్ట ఆలోచనల కుట్ర అని ఖర్గే తెలిపారు. ఓ ఘోర తప్పిదం ఆర్థిక విపత్తుకు శిలాస్థూపంగా మారిందని, ఈ అరాచక నిర్ణయం దేశ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిందని విమర్శించారు. దేశంలోని సామాన్యుడి జేబులు కొట్టేసేందుకు, ఈ ప్రభుత్వం ఎంచుకున్న కొందరు స్నేహితుల పారిశ్రామికవేత్తల ఖజానాలు నింపేందుకు తలపెట్టిన ఆర్థిక కుట్ర అని రాహుల్ గాంధీ స్పందించారు. ఇటువంటి చర్యకు దిగిన ప్రధాని నరేంద్ర మోడీని ఈ దేశం ఎప్పటికీ క్షమించబోదని కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా మండిపడ్డారు.

ఏడేళ్ల క్రితం ఇదే రోజు రాత్రి జరిగిన పిడుగుపాటు వ్యవహారం గురించి ఇప్పటికీ కోట్లాది మంది బాధితులు జవాబులు వెతుక్కుంటున్నారని రాహుల్ స్పందించారు. లక్షలాది మంది చిన్న వ్యాపారులు తమ వ్యాపారాలను మానుకోవల్సి వచ్చింది. కోట్లాది మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోవల్సి వచ్చింది. ఎందుకు ఇదంతా జరిగింది? అంతకు ముందటి దేశ ప్రగతి గతిని దెబ్బతీస్తూ ఈ విధంగా దిగజార్చడం జరిగిందని ప్రశ్నించారు. 2016 తరువాత నక్సల్స్ బెడద పోయిందా? నకిలీ నోట్ల చలామణి తగ్గిందా? ఈ విధంగా పలు ప్రశ్నలు ఉన్నాయని, వీటికి ఇప్పుడు తగిలి రగులుకుంటున్న గాయాలకు నయం ఎప్పుడు? జవాబులు ఎప్పుడు? అని నిలదీశారు. దేశంలోని 99 శాతం సామాన్య సగటు ఇండియన్లపై దాడి జరిగింది. ఇక ప్రయోజనం చేకూరింది కేవలం 1 శాతం క్యాపిటలిస్టు మోడీ ఫ్రెండ్స్‌కు అని ఘాటుగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News