Sunday, January 19, 2025

ఫిబ్రవరిలో ప్లీనరీ సమావేశాల నిర్వహణకు కాంగ్రెస్ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో 85 వ ప్లీనరీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ అత్యున్నత నిర్ధాయక సంఘం వర్కింగ్ కమిటీ స్థానంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

ఏఐసీసీ ప్లీనరీ సెషన్, భారత్ జోడో యాత్రపై స్టీరింగ్ కమిటీలో విస్తృతంగా చర్చించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండడంతో జనవరి 26 నుంచి హాథ్ సే హాథ్ జోడో పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

ఈ ప్రచారోద్యమంలో భాగంగా గ్రామ పంచాయితీలు, పోలింగ్ బూత్‌లను కవర్ చేస్తూ బ్లాక్‌స్థాయి యాత్రలు చేపడతామని చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్‌ఘడ్ సిఎం భూపేష్ బఘేల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు పి. చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోనీ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News