Thursday, January 23, 2025

రైతు ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చొప్పదండి రూరల్: చొప్పదండి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజక ఇంచార్జి మేడిపల్లి సత్యంలు పాల్గొన్నారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని, ర్యాలీగా తరలి వెళ్లి తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా చేస్తున్నామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఎప్పుడైనా కొనుగోలు కేంద్రాలు చూశాడా అని రైతు కష్టం తెలుసా అని రాబోయే ది కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లం కాడనే ధాన్యం కొంటామని అన్నారు.

కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టామని అన్నారు. రైతులు అంటేనే కాంగ్రెస్‌పార్టీ అని రైతులకు లాభం చేకూర్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముద్దం తిరుపతి, కౌన్సిలర్లు కొట్టె అశోక్, పెరుమాండ్ల మానస గంగయ్య గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ పురం రాజేశం, ఆరు మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు చీకటి కుమారస్వామి, జక్కుల అనిల్‌కుమార్, కట్టెకోల శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, కోలపూరి శ్రీకాంత్, కట్టెకోల నవీన్, భీమయ్య, కనుమల్ల రాజశేఖర్, సంబోజి సునీల్, జాడి రాజు, పెరుమాండ్ల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News