Friday, October 18, 2024

కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఎన్నికల ప్రక్రియలో భాగం గా అభ్యర్థుల భవితవ్యం తేలడానికి ఇక కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలింది. ఈనెల 13 తేదీ నుంచి ప్రధాన పార్టీలతో పాటు అభ్యర్థుల్లో నెలకొన్న టెన్షన్ అంతా జూన్ 4వ తేదీతో పో నుంది. 04వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నానికే ఇంచుమించు ఫలితాలన్నీ తేలిపోనున్నా యి. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిల మధ్య పో రు జరగ్గా ఎపిలో ప్రధాన పోటీ టిడిపి,- జనసేన,- బిజెపిల కూటమి, వైసిపిల మధ్య నడిచింది. దే శంలో కొన్నిచోట్ల రేపు 7వ విడత (చివరి) ఎన్నికలు జరుగనుండగా 04వ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఫలితాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 01వ తేదీ సాయంత్రం నుం చి ఎగ్జిట్‌ఫోల్స్ వెలువడనున్నాయి. దేశంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏయే రాష్ట్రాల్లో ఏ యే పార్టీలు చక్రం తిప్పుతాయో సర్వేలతో ఆ యా సంస్థలు వెలువరించనున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బిజెపిలు అధికారం కోసం పో టీ పడుతుండగా పలు రాష్ట్రాల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బూత్‌ల వారీ పోలింగ్ అంచనాలు
ఎవరి అంచనాలు వారికి ఉండడంతో పాటు ఎ వరి ధీమా వారికి ఉంది. గెలిచే వారికి ఓడిపో తామనుకునే వారికి సైత భయం పట్టుకోవడం విశేషం. ఈనెల 13వ తేదీన పోలింగ్ జరిగినప్ప టి నుంచి అభ్యర్థులతో పాటు, సాధారణ ప్రజ ల్లో కూడా ఎవరు గెలుస్తారన్న టెన్షన్ నెలకొం ది. పోలింగ్ పూర్తికాగానే అభ్యర్థులు విశ్రాంతి పేరుతో విదేశాలు, ఇతర రాష్ట్రాలకు ఫ్యామిలీతో వెళ్లిపోయారు. కొంత టెన్షన్ తగ్గించుకోవడంతో పాటు ఎన్నికల ప్రచారంలో అలుపెరగకుండా తిరగడంతో కాస్త సేద తీర్చుకోవడానికి చాలామంది అభ్యర్థులు టూర్‌లకు వెళ్లారు. ఇప్పుడిప్పుడే తిరిగి అందరూ తమ నియోజకవర్గాలకు వస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవడంలోనూ, బూత్‌ల వారీ పోలింగ్ అంచనాలు, తమకు వస్తాయనుకునే ఓట్ల విషయంలోనూ ఇప్పటికే పలు పార్టీలతో పాటు అభ్యర్థులు లెక్కలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థుల్లో ధీమా కనిపిస్తోంది.

పరువు దక్కే విధంగా తమకు ఓట్లు
కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా తమకు ఎన్ని ఓట్లు వస్తాయి, ప్రధాన అభ్యర్థులకు ఎవరికీ నష్టం తెస్తాయన్న అంచనాల్లో ఉన్నారు. కనీసం పరువుదక్కే విధంగా తమకు ఓట్లు వస్తాయా లేదా అనే విధంగా కూడా ఆలోచించుకుంటున్నారు. ఇలా తెలంగాణ, ఎపిలోనూ అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ పేపర్‌లో భద్రపరిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 10 నుంచి 14 సీట్లు వస్తాయని ఆ పార్టీ అంచనా వేస్తుండగా బిజెపి సైతం 6 నుంచి 9 సీట్లకు తగ్గకుండా వస్తాయని భావిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని సమీక్షించుకున్న అభ్యర్థులు, పార్టీలు వచ్చేనెల 04వ తేదీన తమ భవితవ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలే తమకు శ్రీరామరక్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఇక బిజెపి పార్టీ మాత్రం దేశవ్యాప్తంగా మోడీకి ఉన్న ఆదరణే తమకు అధికంగా సీట్లు రావడానికి కారణమవుతుందని భావిస్తోంది. ఇక బిఆర్‌ఎస్ కూడా గత పదేళ్లలో తాము చేపట్టిన అభివృద్ధితో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో మాట తప్పిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని అదే తమ అభ్యర్థులను గెలిపిస్తుందని బిఆర్‌ఎస్ పార్టీ ఆశిస్తోంది. ఇలా ఎవరికీ వారే గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూ తమ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News