- Advertisement -
దుగ్గొండి: దుగ్గొండి మండలంలోని బొబ్బరోనిపల్లి గ్రామంలో మండల యూత్ అధ్యక్షుడు నరిగె ప్రవీణ్ ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. దళిత కుటుంబానికి దళిత బంధు, బీసీ ప్రజలకు బీసీ బంధు కేవలం ఎన్నికల్లో గెలుపొందేందుకు బీఆర్‌ఎస్ తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత కుటుంబాలకు రూ. 6 లక్షలు ఇంటి నిర్మాణానికి అందిస్తామన్నారు.
అంబేద్కర్ అభయ హస్తం కింద రూ. 12 లక్షల అధిక సాయం అందిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకరావడమే లక్షంగా పనిచేయాలన్నారు. దొంతి మాధవరెడ్డి చేతి గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరె రాజేష్, నాగరాజు, సాంబయ్య, లక్ష్మణ్, రాజు, రజిత స్వామి, రవి, శంకర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -