Wednesday, January 15, 2025

ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న మరో కాంగ్రెస్ అభ్యర్థి

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ లోని ఇందోర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాల్సిన కాంగ్రెస్ నాయకుడు అక్షయ్ కాంతి బమ్ సోమవారం లోక్ సభ ఎన్నికల నుంచి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇందోర్ లోక్ సభ సీటుకు బిజెపి ఎంపీ శంకర్ లాల్వానీ కి వ్యతిరేకంగా అక్షయ్ కాంతి బమ్ నిలబడ్డారు. నాలుగో దశ ఎన్నికలు మే 13 న జరుగనున్నాయి. ఆ రోజున ఇందోర్ లోక్ సభ సీటుకు కూడా ఎన్నికలు జరుగుతాయి.

అక్షయ్ కాంతి బమ్ తన నామినేషన్ ఉపసంహరించుకోగానే ఆయనను ఇందోర్ బిజెపి నాయకుడు, ఎంఎల్ఏ కైలాస్ విజయ్ వర్గీయ బిజెపిలోకి ఆహ్వానించారు. ఆయన ట్విట్టర్ లో కూడా పోస్ట్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News