Monday, December 23, 2024

కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. తిట్టిన ప్రతిసారీ ఓడుతోంది : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాంగ్రెస్ ఇప్పటికి తనను 91 సార్లు తిట్టిందని, తనను నిందించడమే పనిగా పెట్టుకున్నా తాను మాత్రం కర్ణాటక ప్రజల కోసమే మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతానని , తనను తిట్టిన ప్రతిసారీ కాంగ్రెస్ ఘోరపరాభవం చవి చూస్తోందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక లోని బీదర్ జిల్లా హుమ్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ శనివారం ప్రసంగించారు. మోడీ విషసర్పమని, తాకితే ఖతం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలకు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు.

Also Read: కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. తిట్టిన ప్రతిసారీ ఓడుతోంది : ప్రధాని మోడీ

తనను తిట్టినప్పుడల్లా ప్రజలు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల కష్టాలను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని , కాంగ్రెస్ హయాంలో సొంతింటి కల మందగమనంలో సాగేదని, బీజేపీ వచ్చిన తర్వాతే మహిళలకు ఇళ్ల యాజమాన్య హక్కులు కల్పించడమైందని చెప్పారు. కాంగ్రెస్ హయాంతో పోల్చుకుంటే రాష్ట్రంలో బీజేపీ హయాంలో విదేశీ పెట్టుబడులు మూడింతలు పెరిగాయని , రాష్ట్రం డబుల్ డెవలప్‌మెంట్ , డబుల్ స్పీడ్‌తో ఉందని అన్నారు. కాంగ్రెస్ రైతులకు కేవలం తప్పుడు హామీలు ఇవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం రైతులు పొందలేదని విమర్శించారు. బీజేపీని మరోసారి గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News