సిసి ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్‌గా దివ్యవాణి నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్: సినీ నటి దివ్యవాణికి కాంగ్రెస్ కీలక పదవిని కట్టబెట్టింది. గురువారం పార్టీలో చేరిన దివ్యవాణికి పిసిసి ప్రచార కమిటీలో చోటు కల్పించింది. పిసిసి ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్‌గా దివ్యవాణిని నియమించింది. ఈ మేరకు చైర్మన్ మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఆమోదం తెలిపారు. ఎన్నికల సమయంలో చేరికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగానే దివ్యవాణిని పార్టీలోకి ఆహ్వానించింది.
పిసిసి ప్రచారకమిటీలో కీలక బాధ్యతలు అప్పగించింది. గతంలో టిడిపిలో లో సుదీర్ఘ కాలం దివ్యవాణి పనిచేసి రాజీనామా చేశారు. టిడిపి మహానాడు వేదికపై ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన దివ్యవాణి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి పార్టీకి రాజీనామా చేశారు. బిజెపిలో చేరుతుందని ప్రచారం జరిగినా దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిక సమయంలో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు దివ్యవాణిని పిసిసి ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమించారు.