Monday, December 23, 2024

కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఉచిత విద్యుత్‌పై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ చౌటుప్పల్‌లో బుధవారం బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి మాట్లాడుతూ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రైతులకు చేసిందేమీ లేదన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ను అందించడం జరుగు తుందన్నారు. అది నచ్చని కాంగ్రెస్ ఉచిత విద్యుత్‌ను ఎత్తి వేయాలన్న దురుద్దేశ్యంతో కుట్రలు పన్నుతుందని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే రేవంత్ తన నోటి దురుసు వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ముందుగానే బయట పెట్టారని తెలిపారు.

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎన్ని ఎత్తులు వేసినా ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యమని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక ఛైర్మన్ పల్లె రవికుమార్, స్థానిక మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, సింగిల్ విండో ఛైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, మాజీ మార్కెట్ ఛైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News