Saturday, October 5, 2024

కాంగ్రెస్‌ది కడుపు మంటే..!

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుంటే కాంగ్రెస్ కడుపు మంటతో విమర్శలు చేస్తోందని మండల బిఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌పై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు బుధవారం బిఆర్‌ఎస్ నాయకులు స్థానిక ప్రధాన సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై బైఠాయించి రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులకు జోలికి వస్తే బొంద పెడతామని, రైతులను ఆదుకున్నది బిఆర్‌ఎస్ పార్టీ అని అన్నారు.

ఆ అక్కసుతోనే వ్యవసాయానికి రైతుకు మూడు గంటల విద్యుత్ చాలు అని విమర్శిస్తున్న పార్టీని అదే రైతులు వచ్చే ఎన్నికల్లో నామ రూపాలు లేకుండా తరిమి తరిమి కొడతారని అన్నారు. దేశంలో ఎ క్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు చేస్తూ అందిస్తున్న ఘనత బిఆర్‌ఎస్ పార్టీదేనని కళ్ళుండి చూడలేని ఈ కాంగ్రెస్ పార్టీ రైతులను కూలీలుగా చేసే విధంగా వ్యాఖ్యానిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాలించిన కాంగ్రెస్ రైతులకు, ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొరి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జల్లిపల్లి శ్రీరామమూర్తి, జెడ్పీటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, పార్టీ మండల అద్యక్షులు బండి పుల్లారావు, టౌన్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, చిన్నంశెట్టి సత్యనారాయణ, మోహన్‌రెడ్డి, శ్రీను, మోహన్, బజారీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News