Wednesday, January 22, 2025

కాంగ్రెస్ నా బొంద తవ్వుతోంది: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

మద్దూరు: కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తన బొంద తవ్వడంలో నిమగ్నమై ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆరోపించారు. పైగా ఆయన తాను మాత్రం పేదల సంక్షేమానికి, దేశాభివృద్ధికి పాటుపడుతున్నానని అన్నారు. తనకు ప్రజల ఆశీస్సులే రక్ష అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెలలో జరుగనున్నాయి. దీనిని పురస్కరించుకుని ఆయన ఈ ఏడాది ఆరోసారి కర్నాటకను సందర్శించారు. కర్నాటక వేగంగా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమన్నారు.

ఆయన బెంగళూరు-మైసూర్ మధ్య 118 కిమీ. ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌ను మాండ్య జిల్లాలోని మద్దూరులో ప్రారంభిస్తూ కాంగ్రెస్ తన బొంద తవ్వాలని కలలు కంటోందన్నారు. కానీ తాను మాత్రం పేదల జీవితాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. కానీ అదెలాగో తెలుపలేదు. అయితే పేదల కడగండ్ల విషయంలో కాంగ్రెస్ ఎన్నడూ బాధపడలేదన్నారు. తన ప్రభుత్వం పేదల బాధలు అర్థం చేసుకుందన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజకీయవేత్తగా మారిన సినీ నటి, మాండ్య ఎంపీ సుమలత అంబరీశ్ కూడా పాల్గొన్నారు. సుమలత ఇటీవల బిజెపికి మద్దతునిస్తానని ప్రకటించారు. మార్గమధ్యంలో మోడీ కారు దిగి జానపద కళాకారులను కలుసుకున్నారు. జనంతో మమైకమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News