Monday, December 23, 2024

భోళా రాహుల్‌ను కాంగ్రెస్‌వారే ముంచేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : రాహుల్ గాంధీని బలిపశువును చేసేందుకు కాంగ్రెస్‌లోని కొందరు నేతలే కుట్రలకు దిగుతున్నారని బిజెపి సీనియర్ నేత, కర్నాటక ఎంపి లహర్ సింగ్ సిరోయా ఆరోపించారు. రాహుల్ ఇప్పుడు ఆయనను పక్కదోవ పట్టిస్తున్న సలహాదార్ల బృందంతో తప్పటడుగులు వేస్తున్నారని, ఇది ఎటునుంచి ఎటుపోతుందో తెలియదన్నారు. ఇప్పటికైతే వివాదాలతో ఆయనను ఎంపి పదవి పోగొట్టుకునేలా చేశారని సిరోయా తెలిపారు.

పార్టీలోని వారే ఆయనను తప్పుదోవ పట్టిస్తూ చివరికి బలి అయ్యేలా చూస్తున్నారని, ఇటువంటి వారిని ఏమనాల్సి ఉంటుంది, అదే విధంగా ఇటువంటివారినే నమ్ముతున్న రాహుల్‌ను ఏ విధంగా పేర్కొనాల్సి ఉంటుందని ప్రశ్నించారు. రాహుల్ భోళాభాళా, నిష్కపటి అని , ఆయనను నమ్మించి కొందరు నిండా ముంచుతున్నారని ఈ బిజెపి నేత వ్యాఖ్యానించారు. బిజెపిరాహుల్ పట్ల ద్వేషంతో వ్యవహరిస్తోందనే వాదనను ఆయన తోసిపుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News