Wednesday, January 22, 2025

గ్యారంటీల పేరుతో గారడీ చేస్తోంది కాంగ్రెస్: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమ పార్టీ ఎంఎల్ఏలు పార్టీ మారటం చూసి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్రస్ట్రేషన్ లో పడిపోయారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కుమార్తె కవిత లిక్కర్ కేసు, ఫోన్ల ట్యాపింగ్ కేసుల్లో బిఆర్ఎస్ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు. పైగా గెలిచిన ఎంఎల్ఏలను కూడా కాపాడుకోలేకపోతోందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో గారడీ చేస్తూ ఓట్లు దండుకొంటోందని అన్నారు. ఓట్ల కోసం రేవంత్ రెడ్డి మళ్లీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కొన్నింటినే అమలు చేశారని అన్నారు(పింఛను పెంపు, ఇందిరమ్మ ఇళ్లు ఇంకా అమలు కావలసి ఉంది). ఇప్పుడేమో ఆగస్టు 15 కల్లా రైతు రుణ మాఫీ చేస్తామంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ అయిపోగానే రుణమాఫీ అమలు చేయకుండా ఆగస్టు 15 వరకు ఆగాల్సిన పనేమిటన్నారు. ఎన్నిక ప్రచారంలో తమ బిజెపి పార్టీ ముందని గర్వంగా చెప్పుకున్నారు కిషన్ రెడ్డి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News