Monday, December 23, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చని హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ నేతలకు టచ్ లో ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. రాష్ట్రంలో మనం మనం తరువాత కొట్లాడుదాం ముందు ప్రాంతీయ పార్టీలను బొందపెడదామని కాంగ్రెస్ కు పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలను బిజెపి గెల్చుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నదే తమ పార్టీ ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యేలను లాగేసుకుని ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి బిజెపికి లేదని, అయోధ్య రామ మందిర్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ధార్మిక కేంద్రాన్ని వివాదాస్పదం చేయొద్దని కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు హితవు పలికారు. యాదాద్రిలో తన బొమ్మ చెక్కించుకున్నది, యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చేసింది గత పాలకులేనని ఆరోపించారు. అయోధ్యలో మోడీ తన బొమ్మ చెక్కించుకోలేదని, రామ జన్మభూమి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేయలేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News