Monday, December 23, 2024

మల్కాజిగిరిలో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థులను వెతుకుతోంది

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్

మన తెలంగాణ / హైదరాబాద్:  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, కౌంటర్లతో రాజకీయ వాతావరణాన్ని మరింత హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలపై ఫైర్ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఈటల ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సిఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిని ప్రకటించాలని ఛాలెంజ్ చేశారు. మల్కాజిగిరిలో తనపై పోటీ చేయించేందుకు కాంగ్రెస్ డబ్బు ఉన్న అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకుతోందని ఈటల ఆరోపించారు. ఇవి డబ్బు సంచులు, ధర్మానికి మధ్య జరిగే ఎన్నికలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నీటి బుడగ అని ఈటల ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఈటల డిమాండ్ చేశారు. మమ్ముల్ని గెలిపించండి, మోడీని ఒప్పించి తెలంగాణ కు కావాల్సిన నిధులు అన్నీ తీసుకువస్తామన్నారు.ఈ పదేళ్లలో 7 లక్షల కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ అభివృద్ధి జరిగిందన్న ఆయన ఈ ఎన్నికల్లో గెలిపిస్తే రెండింతలు అభివృద్ది చేసి చూపిస్తామన్నారు.గెలిపిస్తే డబుల్ డెవలప్ మెంట్ చేస్తా అని మోదీ హామీ ఇచ్చారు.

నేను 15 రోజులనుండి నియోజకవర్గంలో తిరుగుతున్న ఎక్కడికి పోయినా ఈ సారి మోడీకి ఓటు వేస్తామంటున్నారని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో తెలంగాణలో మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఓట్లు వస్తాయ ధీమా వ్యక్తం చేశారు. మాజి సిఎం బిఆర్‌ఎస్ నేత కెసిఆర్ ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను మార్చారన్నారు.9 లక్షల ఓట్లు వచ్చిన కూడా బిఆర్‌ఎస్ తరఫున ఎవరు నిలబడడానికి ముందుకు రావడం లేదన్నారు.ఒకప్పుడు పొగిడిన కెసిఆర్ మళ్ళీ మోదీనీ తిడితే.. మీ తిట్లే నాకు ఆశీర్వాదం అని చెప్పిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడి అన్నారు. కెసిఆర్ ఓడిపోవాలనే మంటతో నీకు అధికార బిక్ష పెడితే కళ్ళు నెత్తికి ఎక్కాయని ఈటెల రాజేందర్ విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News