Sunday, December 22, 2024

కరోనా వైరస్ కంటే డేంజర్ కాంగ్రెస్ : రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ, మొత్తంగా పేదల వ్యతిరేక పార్టీ అని మరోసారి స్పష్టమైం దని రెడ్కో చైర్మన్ వై.సతీష్‌రెడ్డి అన్నారు. రైతులు, దళితులకు ఆర్థిక సాంత్వన చేకూర్చేలా తీసుకొచ్చిన పథకాలను ఆపాలంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసి తన నీచ బుద్ధిని బయట పెట్టుకుందని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న మొత్తాన్ని కూడా కాంగ్రెస్ అడ్డు కుంటోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవన్నారు. కానీ రాష్ట్రంలో ఫేక్ హామీలిస్తూ మరోవైపు ఇలా తమ నీచ బుద్ధిని బయట పెట్టుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.

రైతులకు పంట పెట్టుబడికోసం పంట వేసే సమ యంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నీచ బుద్ధి ప్రదర్శించి రైతులకు పంట పెట్టుబడి సాయం అందకుండా చేస్తోందని, పంట వేసే సమయంలో డబ్బులు అందకపోతే ఆ తర్వాత రైతుకు ఆ డబ్బులు ఇచ్చి కూడా వృథానే, చేతిలో డబ్బులు లేక పంట వేయడానికి రైతులు ఇబ్బంది పడతారన్నారు. ఇప్పుడు రైతుబంధు వద్దంటూ ఇసికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్. రేపటి రోజు వంట అమ్మిన ధాన్యం డబ్బులు కూడా అకౌంట్‌లో వేయకుండా ఆపాలని ఫిర్యాదు చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కరోనా వైరస్ కంటే దుర్మార్గంగా తయారైందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News