Monday, January 20, 2025

కాంగ్రెస్ అంటే కరప్షన్ పార్టీ:  జెపి నడ్డా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అంటే కమిషన్, క్రిమినలైజేషన్, కరప్షన్ పార్టీ అని మజ్లిస్, కాంగ్రెస్ రెండు అవినీతి, కుటుంబ పార్టీలని బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా విమర్శించారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ జనప్రియ అపార్టుమెంట్ వాసులతో కలసి ప్రధాని మన్‌కీబాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతర మాట్లాడుతూ భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళేందుకు బిజెపికి ఓటు వేయాలని విజ్ఙప్తి చేశారు. సామాజిక న్యాయం ప్రధాని మోడీతో సాధ్యమని, రెండు పర్యాయాలు అధికారం ఇస్తే రాష్ట్రపతులను దళిత వర్గాలకు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనన్నారు. తెలంగాణలో అధికారం చేపడుతామని, ముఖ్యమంత్రిగా బిసి నాయకుని చేసి కాంగ్రెస్ పార్టీ అరాచక రాజకీయాలకు బుద్ది చెబుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి, టి బిజెపి కిషన్ రెడ్డి, జూబ్లీ హిల్స్ అభ్యర్థి దీపక్ రెడ్డి పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News