Friday, December 20, 2024

కాంగ్రెస్ అంటేనే కటిక చీకటి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: కటిక చీకటి కాంగ్రెస్‌ను తరమికొడుదాం అని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు.గురువారం దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలను ఖండిస్తూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ కే ద్రంలో ధర్న కార్యక్రమంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి రైతన్న జీవితాలలో కెసిఆర్ వెలుగులు నింపారని అన్నారు.ఉచిత విద్యత్‌కు కుట్ర చేస్తున్న కాంగ్రెస్‌పై తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు ఆగ్రహంతో ఉన్నారు అని అన్నారు.24గంటల కరెంట్ ఇచ్చి సాగును సిఎం కెసిఆర్ పండుగగా మార్చుతే.ఈ కాంగ్రెస్ వోళ్లు రైతుల పోట్ట కొట్టాలని చూస్తున్నారని ఆగ్రం వ్యక్తం చేశారు.24గంటల కరెంట్ రద్దు చేసి 3గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చేప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ట అన్నారు.నిన్నటిదాక ధరణి రద్దు.రైతుబంధు వద్దు అంటూ ఇప్పటికే రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా ఉచిత కరెంట్ ఎత్తేస్తామన్న తన క్రూరమైన అలోచనలను బయట పట్టుకున్నారని అన్నారు.3గంటల కరెంట్ చాలు అన్నవారి మాడ పగిలేలా జవాబు చేప్పలాని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ్మ,జడ్పిటిసి సలహాదారులు మారుపాకుల సురేష్‌గౌడ్,మండల అధ్యక్షుడు టివిఎన్‌రెడ్డి,యుగేందర్‌రెడ్డి,ముత్యాల సర్వయ్య,వైస్‌ఎంపిపి చింతపల్లి సుభాష్‌గౌడ్,రహత్ అలీ,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నేనావత్ శ్రీను నాయక్,పోట్ట మధు,వాజీద్ పాషా,వేముల రాజు,బొడ్డుపల్లి కృష్ణ తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News