Monday, December 23, 2024

కాంగ్రెస్ అంటే కటిక చీకటి

- Advertisement -
- Advertisement -

అంతర్గాం: నాడు సమైక్యపాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని రైతు కంటక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.

గరువారం మండలంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ఎమ్మెల్యే కోరుకంటికి ఘన స్వాగతం పలికారు. కోరుకంటి ముందు ట్రాక్టర్ నడుపుతుండగా వెనుక రైతులు ట్రాక్టర్లతో ఎమ్మెల్యే కోరుకంటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కంటక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టాలన్నారు. 60 ఏళ్ల పాలనలో ఏ ఒక్క నాయకుడు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

నాడు కరెంటు అడిగినందుకు రైతులను కాల్చి చంపిన చంద్రబాబు వ్యవసాయం దండగన్నారు. ఆ చంద్రబాబు వారసునిగా రేవంత్ రెడ్డి మూడు గంటలే కరెంట్ చాలంటూ రైతుల ఆత్మహత్యలకు కారణం కానున్నాడని విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న సీఎం కేసీఆర్ కావాలో, మూడు గంటలు చాలంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావాలో రైతులే నిర్ణయించుకోవాలని కోరారు.

కాంగ్రెస్ పాలనలో ఎరువులు, కరెంటుకు కరువు వచ్చిందని, కాలేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు కరెంటు, నీళ్లు, పెట్టుబడి సాయం, రైతు బీమా అన్ని అందుతున్నాయని అన్నారు. 2018 నుండి క్లస్టర్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 33 మంది రైతులకు రూ.1.65 కోట్ల రైతు బీమా అందించామన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూ.80 కోట్లతో 27ఎల్ లిఫ్ట్ ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందుతుందన్నారు. 9 ఏళ్ల కాలంలో వందేళ్ల పరగతి సాధించారని అన్నారు.

రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు పంటలు బీఆర్‌ఎస్ నినాదం, మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానమని, కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలో, కరెంటు వెలుగుల బీఆర్‌ఎస్ కావాలో రైతులు తేల్చుకోవాలని అన్నారు. రాబోయే కాలంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికులుగా మారి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కావాలని రైతులంతా ఏకగ్రీవ తీర్మాణం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్‌ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ దివాకర్, మండల కోఆప్షన్ గౌస్‌పాషా, సర్పంచ్‌లు బండారి ప్రవీణ్, ధరణి రాజేష్, దేవమ్మ రాములు, మెరుగు పోశం, రవీందర్, బాదరవేని స్వామి, ధర్మాజీ కృష్ణ, తుంగపిండి సతీష్, ఎంపీటీసీ మస్కం శ్రీనివాస్, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తిరుపతి నాయక్, నాయకులు ఎదులాపురం వెంకటేష్, కొలిపాక మధుకర్ రెడ్డి, కోల సంతోష్ గౌడ్, కుర్ర నూకరాజు, గీట్ల శంకర్ రెడ్డి, కుర్ర సన్ని, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News