Wednesday, January 22, 2025

ఎస్సీ వర్గీకరణ ఆలస్యానికి.. కాంగ్రెస్ మొదటి ముద్దాయి

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వాలు వర్గీకరణపై నిర్లక్షం చేశాయి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ఆలస్యం చేయడంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీనేని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో చాలా ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై ఎన్నో కమిటీలు వేశాయని, దేశంలో ఎస్సీల వర్గీకరణ గురించి 30 సంవత్సరాలుగా పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై అన్ని పార్టీలు కంటితుడుపు చర్యగా ప్రవర్తించాయని, యూపీఏ ప్రభుత్వం కూడా తుషార్ మెహతా కమిటీ వేసి వదిలేసిందని తెలిపారు.

నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కమిటీ నివేదికను కూడా చదవలేదని ఆరోపించారు. మందకృష్ణ మాదిగ జులైలో ప్రధాని మోదీని కలిసి వర్గీకరణ విషయాన్ని పూర్తిగా వివరించారని వెంటనే ఆగస్టులో ఎమ్మార్పీయస్ నాయకులను అమిత్ షా హస్తినకు పిలిపించుకుని మాట్లాడారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టులో రెండు ధర్మాసనాలు పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని పేర్కొన్నారు. దీనిపై స్పష్టత కోసం ఏడుగురు న్యాయమూర్తులతో అక్టోబర్ 10న మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.

అనేక రాజకీయ పార్టీల మద్దతు ఉన్నా అనేక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పింది. తెలుగు రాష్ట్రాలను పాలించిన టీడీపీ దీన్ని నాలుగు సంవత్సరాలు అమలు చేసింది. దీనిపై కంటితుడుపు చర్యనే తప్ప ఎవరూ కూడా చిత్తశుద్ధితో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు. తమ పార్టీలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఎవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర ఏంటని స్వాతంత్య్రం ఏర్పాటు తర్వాత మొట్టమొదటి సారి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత మోడీ ప్రభుత్వ దక్కుతుందన్నారు. కాంగ్రెస్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అటల్ బిహారి వాజ్‌పాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటిసారిగా ప్రధానిని చేసే అవకాశం వచ్చినప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశామని చెప్పారు. బిజెపి ఏది చెప్తే అదే చేస్తుందని కాంగ్రెస్ మాదిరిగా ఒకటి చెప్పి మరొకటి చేసే పార్టీ కాదని ఎద్దేవా చేశారు. చారిత్రాత్మక కట్టడాలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోడీ తనకు తానే సాటి అని ఎస్సీ వర్గీకరణపై శాశ్వత పరిష్కారం కోసం తమ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News