ఓదెల/కాల్వశ్రీరాంపూర్: రైతులను కాల్చుకుతిన్న రాబందుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో పవర్ హాలీడేలు, క్రాఫ్ హాలీడేలు ఉండేవని, కాంగ్రెస్ పార్టీని, నాయకులను పొలిమేరల నుండి తరమి కొట్టాలని రాబోయే ఎన్నికల్లో రైతన్నలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.
మంగళవారం ఓదెల మండలం కొలనూర్, ఉప్పరపల్లి, గోపరపల్లి, హరిపురం గ్రామాల రైతులతో కొలనూర్ రైతు వేదికలో మండల పార్టీ అధ్యక్షతన మేలుకో రైతన్న సమావేశాన్ని నిర్వహించారు. అలాగే కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి, మడిపల్లి, అంకంపల్లి, ఆశన్నపల్లి, మడిపల్లి కాలనీ, గంగారం గ్రామాల రైతులతో పెగడపల్లి రైతు వేదికలో పాల్గొని మాట్లాడారు. వీటికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని రైతులను కోరారు.
రాష్ట్రంలో కరెంటు కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని కేసీఆర్ ఉద్యమ జెండాను ఎత్తుకున్నారని తెలిపారు. సాగు రంగాన్ని సంక్షోభం నుండి బయట పడేయాలని సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో విప్లవాత్మక పథకాలను తీసుకువచ్చారని తెలిపారు. 9 ఏళ్ల పాలనలో 4.50 లక్షల కోట్లను ఖర్చు చేసి సరికొత్త రికార్డు సృష్టించారని అన్నారు. మూడు పంటల తెలంగాణ కావాలని బీఆర్‌ఎస్ సంకల్పం తీసుకుంటే మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ రైతు ద్రోహి విధానాన్ని ప్రకటించిందని మండిపడ్డారు. మూడు పంటల బీఆర్‌ఎస్ కావాలా, మూడు గంటల కాంగ్రెస్ కావాలో రైతాంగం తేల్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, రైతు సమితి మండల కోఆర్డినేటర్ కావేటి రాజు, మార్కెట్ వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా డైరెక్టర్ బుచ్చిరెడ్డి, ఆకుల మహేందర్, అనుబంధ సంఘాల అధ్యక్షుడు పోతర్ల శ్రీనివాస్, సర్పంచ్‌లు సామ మణెమ్మ శంకర్, కర్క మల్లారెడ్డి, గుండేటి మధు, ఎంపీటీసీ గోపు లావణ్య నారాయణరెడ్డి, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ అమ్ముల భిక్షపతి, రైతు సమితి గ్రామ కోఆర్డినేటర్‌లు బండారి ఐలయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు నరేందర్, రాకేష్, సాయిలు, నాయకులు కాసరపు ఐలయ్య, అంజిరెడ్డి, చిన్న రాజిరెడ్డి, సాతూరి రవి, సాతూరి రాజేశం, మద్దెల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్‌లో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, రైతు సమితి మండల కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకొమురయ్య, ఫ్యాక్స్ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు నూనెటి కుమార్, అనుబంధ సంఘాల అధ్యక్షుడు కారెంగుల రమేష్, కన్వీనర్‌లు నరెడ్ల సదానందం, గొడుగు మల్లేష్, బోయిని సదయ్య, మెడుదుల రాజ్ కుమార్, సర్పంచ్‌లు మల్లారెడ్డి, రమా వెంకన్న, రాణి మోహన్, చిరంజీవి, స్వప్న నాగరాజు, ఎంపీటీసీలు సుముఖం నిర్మల మల్లారెడ్డి, మానస సతీష్, పెండ్లి సంపత్, రైతు సమిగి కోఆర్డినేటర్ జంగ రమణారెడ్డి, ముస్కు అనంతరెడ్డి, ఎరుకల మల్లయ్య, గ్రామ అధ్యక్షుడు కూకట్ల నవీన్, ముస్కు శ్రీనివాస్, కూస హరీష్, నర్సింగం, తూడి మల్లేష్, సర్పంచ్ ఆడేపు శ్రీదేవి రాజు, మాజీ ఎంపీటీసీ రామచంద్రం, మాజీ సర్పంచ్ జక్కే రవి, రవీందర్ రెడ్డి, ఈర్ల శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, రాజేశం,ఏడెల్లి శంకర్, స్వామి, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.