Friday, November 22, 2024

నేడు ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన బృందం కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ (హాథ్ సే హాథ్ జోడో) పాదయాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జనగర్జనకు ఖమ్మం నగరం ముస్తాబైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రానుండటంతో రాష్ట్రంలోని అన్నిదార్లు ఖమ్మం నగరం వైపే పరుగులు తీస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యేందుకు అతి కొద్ది రోజుల వ్యవధి ముందు ఖమ్మంలో జరుగుతున్న బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్న్రేత రాహుల్ గాంధీ హాజరవుతుండటంతో ఈ పార్టీ ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

సుమారు ఐదారు లక్షల మందితో ఈ సభను విజయవంతం చేయాలని విస్తృత ఏర్పాట్లు చేశారు. సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజకవర్గాల మీదుగా 1360 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కాంగ్రెస్ ఎక్కడుందన్న వారికి కాంగ్రెస్ సత్తా ఏమిటో నిరూపించారు. ఆయన పాదయాత్ర ముగింపు, పొంగులేటి పార్టీలో చేరికను ఒకే వేధికపై ఖారారు చేశారు. ఎన్నికల ముగింట్లో జరుగుతున్న ఈ సభను విజయవంతంచేసేందుకు కాంగ్రెస్ పార్టీలోన్ని అన్ని వర్గాలు నడుంబిగించాయి. ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరవుతుండటంతో జన గర్జన సభకోసం ఖమ్మం నగరం మూడురంగుల మయమైంది ఎటు చూసినా మువ్వెన్నెల జెండాలు ప్లక్సీలు, స్వాగత తోరణాలు దర్శనం ఇస్తున్నాయి.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్‌లతో అలంకరించారు. పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు విద్యుత్ స్తంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుంద్రంగా అలంకరించారు. ప్టణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20 అడుగుల సర్కిల్స్, హోర్డింగ్‌లు, భారీ క్టౌట్‌లు, పెద్ద పెద్ద బెలూన్స్ ఎగరేశారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జి ల్లాల నుంచి జన సమీకరణకు అటు డిసిసి ఇటు పొంగులేటి బృందం భారీ ఏర్పాట్లు చేసింది వాహనాల కొరత ఉన్నప్పటికీ దానిని అధిగమించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్టీసి బస్సులను, లారీలను అద్దెకు తీసుకున్నారు. సొంత వాహనాలతోపాటు ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, జీపులు, టెంపోలు, డిసిఎం వాహనాలను బుక్ చేసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ బహిరంగ సభ ప్రారంభం కానుంది.

Also Read: దక్షిణ కొరియాలో మ్యూజికల్ ఫౌంటెన్‌ను సందర్శించిన మంత్రులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News