Monday, December 23, 2024

పట్టించుకోని అధిష్టానం.. అలిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈరోజు జరిగిన స్క్రీనింగ్ కమిటీ ముఖ్యమైన సమావేశంలోనూ ఆయన మౌనం వహించారు. ఆయన అలకకు గల అసలు కారణం తెలియనప్పటికీ.. కీలక పదవులు దక్కకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుజ్జగించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది.

ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎంపీ కోమటిరెడ్డికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. అంతర్గతంగా.. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో.. వచ్చి కలవాలని సూచించినట్లు సమాచారం.

అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే వెళ్లి అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డిని శాంతింపజేయనున్నట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనంతరం ఠాక్రే కూడా కోమటిరెడ్డి ఇంటికి వెళ్తున్నానని.. ఆయన్ను కలుస్తానని ప్రకటన చేశారు. కానీ కోమటిరెడ్డి బలమైన నాయకుడని, కాలక్షేపం చేయడం లేదని సీనియర్ నేత భట్టి చెబుతుండడం గమనార్హం.

పీసీసీకి రేవంత్ రెడ్డి నాయకత్వం అయితే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల విజ‌యం త‌ర్వాత క‌లిసి ప‌నిచేయాల‌ని అధిష్టానం ఆదేశాలతో క‌లిసి ప‌నిచేయాల‌ని భావించారు. ఈ తరుణంలో పార్టీలో చేరిక, సీట్ల కేటాయింపు అంశం మళ్లీ కోమటిరెడ్డిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ రెండింటిలోనూ తనకు స్థానం దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు స్పష్టమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News