Sunday, December 22, 2024

కాంగ్రెస్ ‘డొనేట్ ఫర్ న్యాయ్’ విరాళాల పథకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం సాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర కోసం జనం నుంచి విరాళాలు వసూలు చేసే ప్రచార కార్యక్రమం ‘డొనేట్ ఫర్ న్యాయ్’ను కాంగ్రెస్ శనివారం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రజలకు వారు ఇచ్చిన విరాళాలకు ప్రతిగా రాహుల్ గాంధీ సంతకం చేసిన లేఖ లేదా వస్తువులు అందజేస్తారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్‌తో కలసి న్యూఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రారంభిస్తూ, ఈ పథకానికి, ఇంతకుముందు విస్తృతంగా పార్టీ కోసంసాగించిన విరాళాల కార్యక్రమం ‘డొనేట్ ఫర్ దేశ్’ వెనుక ఉద్దేశం డబ్బు సంపాదించడం కాదని, కార్యకర్తలకు స్ఫూర్తి ఇవ్వడమేనని తెలియజేశారు. పార్టీ ‘డొనేట్ ఫర్ న్యాయ్’ ప్రచార కార్యక్రమం కింద రూ. 670 లేదా అంతకు మించి విరాళం ఇచ్చే ఏ వ్యక్తికి అయినా రాహుల్ సంతకం చేసిన టీషర్ట్ కానుకగా అందుతుందని మాకెన్ తెలిపారు.

‘రూ. 67 వేలు, అంతకు మించి విరాళం ఇచ్చేవారికి ‘న్యాయ్ కిట్’ అందుతుంది. దానిలో ఒక టీషర్ట్, సంచీ, బ్యాండ్, బ్యాడ్జ్, స్టిక్కర్ ఉంటాయి’ అని ఆయన తెలియజేశారు. ‘ఎవరు ఎంత విరాళం ఇచ్చినా రాహుల్‌జీ సంతకం చేసిన లేఖ, ఒక సర్ఠిఫికేట్ అందుకుంటారు’ అని మాకెన్ చెప్పారు. ఆయన వెంట రమేశ్, సంయుక్త కోశాధికారి విజయ్ ఇందర్ సింగ్లా, పార్టీ మైనారిటీ విభాగం చీఫ్ ఇమ్రాన్ ప్రతిప్‌గఢీ ఉన్నారు. కాగా, గత డిసెంబర్ 18న పార్టీ ప్రారంభించిన ‘డొనేట్ ఫర్ దేశ్’ విరాళాల సేకరణ కార్యక్రమం కింద రూ. 20 కోట్లు వసూలు అయినట్లు మాకెన్ తెలిపారు. అయితే, ‘డొనేట్ ఫర్ న్యాయ్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన రెండు గంటల లోపే రూ. 2 కోట్లు వసూలు అయినట్లు మాకెన్ తెలియజేశారు. జనం నుంచి విరాళాలు వసూలు చేసే కార్యక్రమం ద్వారా ఆశించిన స్థాయి కన్నా తక్కువగా విరాళాలు రావడం గురించిన ప్రశ్నకు మాకెన్ సమాధానం ఇస్తూ,

‘మా కార్యకర్తల నుంచి డబ్బు వసూలు చేయడం ద్వారా మేము ఎన్నికలలో పోటీ చేయలేం. జనం నుంచి ఈ విరాళాల సేకరణ ద్వారా ఎన్నికల కోసం మా నిధులు పొందుతున్నామని ఎవరైనా భావించిన పక్షంలో వారి వైఖరి తప్పు. మా ఉద్దేశం ఇది కాదు’ అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News