Wednesday, December 25, 2024

కాంగ్రెస్‌కు ఎకె ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని రాజీనామా

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి ఎకె ఆంటోని కుమారుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అనిల్ ఆంటోని బుధవారం కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక చెంచాగా తాను పనిచేయలేనని, భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న విధ్వంసకర వ్యాఖ్యానాలలో భాగస్వామ్యం కావడం కన్నా స్వతంత్రంగా తన వృత్తిని కొనసాగిస్తానని బుధవారం అనిల్ ఆంటోని ట్వీట్ చేశారు. గుజరాత్ అల్లర్లపై బిబిసి తీసిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనిల్ ఆంటోని మంగళవారం సమర్థించారు.

భారతదేశ సార్వభౌమత్వంపై రాజీపడే ప్రసక్తి లేదంటూ అనిల్ ట్వీట్ చేయగా ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ నుంచి ఆయనపై ఒత్తిడి వచ్చింది. అనిల్ ఆంటోని ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా కన్వీనర్ పదవితోపాటు ఎఐసిసి సోషల్ మీడియా అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సెల్ జాతీయ కోఆర్డినేటర్ పదవిని నిర్వహిస్తున్నారు. ఈ రెండు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News