Sunday, December 22, 2024

ఓటర్లను ఎక్కించుకుని ఆటో నడిపిన డీకే శివకుమార్ (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గంలో బుధవారం ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తరువాత ఆయన ఓటర్లను ఎక్కించుకుని ఆటో నడపడం అందర్నీ ఆకర్షించింది. ఆయన ఎడమవైపు ఓ మహిళ కూర్చోగా, కొందరు పార్టీ కార్యకర్తలు వెనుక సీట్లలో కూర్చుని సందడి చేశారు. ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని పోలింగ్ కేంద్రానికి చేర్చారు. ఆయన ఆటోనడపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాంగ్రెస్ 140 సీట్లు గెల్చుకుంటుందని సర్వేలు చెబుతున్నాయని గత వారం ఒక ప్రత్యేక ఇంటర్వూలో డీకే వెల్లడించారు. కలిసికట్టుగా బీజేపీని ఓడించడమే తమ మొదటి ప్రాధాన్యమని, ముఖ్యమంత్రి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. 2023లో కర్ణాటక లోనూ, 2024లో కేంద్రం లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News