Tuesday, January 21, 2025

కాంగ్రెస్‌కు ఊహించని షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏర్పుల నరోత్తం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో గురువారం నరోత్తం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నరోత్తం గతంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు టిడిపి తరపున ఎంఎల్‌ఎగా పోటీచేశారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. జహీరాబాద్ నియోజకవర్గ మేలుకోసం బిఆర్‌ఎస్ పార్టీలో చేరానని నరోత్తం చెప్పారు. కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందని, సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News