Sunday, January 19, 2025

బిఆర్‌ఎస్‌లో ముగ్గురు.. బిజెపిలో ఇద్దరు మాత్రమే లీడర్లు: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కెసిఆర్ బయటకు వస్తే మా అస్త్రాలు మేం బయటికి తీస్తామని జగ్గారెడ్డి అన్నారు. కెసిఆర్ ఏం చేసినా ఈ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు. బిఆర్ఎస్ లో ముగ్గురు, బజెపిలో ఇద్దరు మాత్రమే లీడర్లని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో లీడర్లకు కొదవ లేదన్నారు. బిజెపి గ్రాఫ్ పడిపోవడంతో ప్రధాని మోడీ, అమిత్ షాకు నిద్ర వస్తలేదన్నారు జగ్గారెడ్డి. కెసిఆర్ మాటలకు ఆగస్టులో సమాధానం చెప్తామని వెల్లడించారు. ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్ లో ఉన్నారో త్వరలో తెలుస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News