Monday, December 23, 2024

ఆ పిచ్చితోనే కాంగ్రెస్ లో కొనసాగుతున్నా: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి బుధవారం ఓ లేఖను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గతం లో ఉన్న విధంగా లేదని ఆవేదన వ్యక్త పర్చారు. గాంధీ భవన్ లో ప్రశాంతత కరువైందని పేర్కొన్నారు.

తన మనసులో ఎన్నో ఆవేదనలు మసులుతున్నాయని, కానీ వాటిని చెబితే ఏమవుతుంది, చెప్పకుంటే ఏమవుతుందో అనే ఆందోళన ఉందన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ కుటుంబం అంటే ఉన్న పిచ్చి కారణంగానే ఇంకా పార్టీలో కొనసాగుతున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News