Sunday, April 6, 2025

ఆప్‌లో చేరిన పంజాబ్ కాంగ్రెస్ నేత జగ్వీందర్‌పాల్ సింగ్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : కాంగ్రెస్ నాయకుడు జగ్వీందర్‌పాల్ సింగ్ గురువారం ఆప్‌లో చేరారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయనకు స్వాగతం పలికారు. ఆప్ ప్రభుత్వ విధానాలకు ప్రజలు సంతోషంగా ఉంటున్నారని, పంజాబ్ ప్రజల కోసం ఎవరైతే శ్రమిస్తారో వారికి ఆప్ స్వాగతం పలుకుతుందన్నారు. 1987 నుంచి కాంగ్రెస్‌లో ఉన్న జగ్వీందర్‌పాల్ సింగ్ 1992లో కౌన్సిలర్‌గా పనిచేశారు. 1999 లో పంజాబ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2022 లో మంజిత స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News