Monday, December 23, 2024

కీలక పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత కమల్‌నాధ్

- Advertisement -
- Advertisement -

Kamal Nath as Congress Working President

భోపాల్ : మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాధ్ హఠాత్తుగా రాజీనామా చేశారు. రాజీనామాకు కారణాలు వివరించలేదు. హైకమాండ్ ఈ రాజీనామాను ఆమోదించింది. కమల్‌నాధ్ స్థానంలో డాక్టర్ గోవింద్‌సింగ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. కొన్ని రోజులుగా కమల్‌నాధ్ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. బీజేపీ చెప్పే బక్వాస్ మాటలు వినడానికి తాను అసెంబ్లీకి వెళ్లనంటూ ఓ ఇంటర్వూలో వ్యాఖ్యానించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కమల్‌నాధ్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరింది. ఈ వ్యాఖ్యలే ఆయన రాజీనామాకు కారణమయ్యాయా అంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ పీసీసీ విషయంలో హైకమాండ్ కొన్ని రోజుల క్రితం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేవ్యక్తికి ఒకే పదవి అన్న సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది. ఈ కారణంగానే కమల్‌నాధ్ రాజీనామా చేశారన్నది ఆయన వర్గం వాదన. ఇదిలా ఉండగా అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఇన్నాళ్లూ సేవలందించినందుకు పార్టీ అధిష్ఠానం కమల్‌నాధ్‌కు ధన్యవాదాలు తెల్పుతూ ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News