- Advertisement -
న్యూఢిల్లీ : చైనా చొరబాట్లపై రాజ్యసభ లోని విపక్ష కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే పాలక బిజెపిపై ద్వజమెత్తారు. భారత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేస్తున్నారని, బిజెపి ప్రభుత్వం తనకు తాను బీజింగ్ జనతా పార్టీగా మారుతోందని శనివారం ఆయన తీవ్రంగా విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా గ్రామాలు నిర్మించుకోడానికి బిజెపి ప్రభుత్వం అవకాశమిచ్చిందని, ఉత్తరప్రదేశ్‌లో చైనా ఎయిర్‌పోర్టును తనదిగా బిజెపి ప్రభుత్వం చూపిస్తోందని ట్విటర్ ద్వారా విమర్శించారు. లడఖ్,ఉత్తరాఖండ్‌లో చైనా చొరబాట్లను కాంగ్రెస్ ఎప్పటినుంచో విమర్శిస్తోందని, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో కూడా చొరబాట్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. చైనాపై చర్య తీసుకుని భారత భూభాగాన్ని తిరిగి మనకు దక్కేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాని మోడీని డిమాండ్ చేశారు.
- Advertisement -