Thursday, January 23, 2025

జిఓ 111 పరిధిలో 80 శాతం భూములు రియల్టర్ల చేతిలో : కోదండరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జీఓ 111 పరిధిలో 80 శాతం భూములు రియల్టర్ల చేతిలో ఉన్నాయని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి తెలిపారు.  జీఓ 111 ఎత్తివేయడంపై ఓ నివేదిక తయారు చేసి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అందజేసినట్లు ఆయన తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరెడ్డి మాట్లాడారు. జంట జలాశయాల నిర్మాణం వెనక కారణం బిఆర్‌ఎస్ కు తెలియదని, ఎఫ్‌టిఎల్ పరిధిలో మంత్రులు ఫాంహౌస్ లు కట్టుకున్నారని ఆయన తెలిపారు.

హిమాయత్ సాగర్ పూర్తి గా నిండక ముందే మంత్రుల ఫాంహౌస్ లు మునగకుండా ఉండేందుకు గేట్లు తెరిచారని కోదండరెడ్డి విమర్శించారు. రియల్టర్ల కోసమే జీవో 111 ఎత్తివేసారని ఆరోపించారు.జీవో 111 పరిధిలో సామన్య ప్రజలకే అన్ని కండీషన్స్‌లని, పెద్ద వారు మాత్రం ఇష్టారీతిలో ఇండ్లను కడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ లీజులో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తే.. మంత్రి ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News