Tuesday, April 1, 2025

బిఆర్‌ఎస్, బిజెపి నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపి మల్లు రవి ఫైర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందన్న బిఆర్‌ఎస్, బిజెపి నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపి మల్లు రవి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు బిఆర్‌ఎస్, బిజెపిలను గౌరవించడం లేదని ప్రజా ఆమోదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి అభ్యర్థులు లేక బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులను చేర్చకుంటున్నారని ఆయన అన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తొలి దరఖాస్తు తనదేనని ఆయన చెప్పారు. టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News